29 నుంచి కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెందిన మెదక్ జిల్లాలోని పాపన్నపేట లక్ష్మీనగర్ లోని 30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని దళితులనకు తిరిగి అప్పగించాలని కెసిఆర్ ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. సాయంత్రం కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివిధ తెలంగాణేతరులు వందలాది ఎకరాలు ఎలా స్వాధీనం చేసుకున్నదీ వివరించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బంధువులకు కూడా భూములున్నాయని ఆయన చెప్పారు. ఈ విధంగా స్థానికేతరులు తెలంగాణలో భూములు కలిగి ఉండడం పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications