ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: రోశయ్య నిర్ణయం

ఓబుళాపురం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నేతలు కూడా సిబిఐ దర్యాప్తునకు సుముఖంగా ఉన్నారు. సిబిఐ దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందని వి. హనుమంతరావు ఇంతకు ముందు అన్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను అడ్డుకోవాలని హనుమంతరావు మంగళవారం కూడా కోరారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడివారు ఎంతటివారైనా ఉపేక్షించకూడదని, వారిని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications