సచివాలయ ముట్టడి: నేతల అరెస్టు

ఎన్ఎంయు నేతలు నాగేశ్వరరావు, మహ్మద్ లతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసినవారిని పోలీసులు అంబర్ పేట పోలీసు గ్రౌండ్ కు తరలించారు. ఇందిరా పార్కు వద్ద ట్రాఫిక్ తీవ్ర అంతారయం కలిగింది. తమ ఆందోళనను అడ్డుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నిలిపేస్తామని ఆయన చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications