జూడాల ఆమరణ దీక్ష భగ్నానికి యత్నం

జూడాలు భవనం మూడో అంతస్థులో ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ ఆందోళనను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఓ జూనియర్ డాక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. నిపుణుల కమిటీ సూచనలను అమలు చేసే వరకు ఆందోళన సాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. కాగా, మంగళవారం నుంచి అత్యవసర సేవలకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అత్యవసర సేవలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications