విశాఖ తీరంలో పూనకాల సునామీ

దీంతో ఆ మహిళ గుడి కట్టండ్రో అంటూ పెద్ద కేకలు వేసి 'నాకు గుడి కట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు....అసలు మీకు తెలుసా...సునామీలను ఆపుచేశాను...నా గుడికి భక్తులు వచ్చే మార్గంలో నిర్మాణాలు జరిగాయి...అందుకే అక్క డ నాలుగు జీవులను బలి తీసుకున్నా ను...' అంటూ ఊగిపోయింది. గుడి కట్టే విషయం తేల్చుకోవడం కోసం 'మా అక్క చెల్లెల్లందరం గ్రామంలోకి వచ్చాం...గుడుల్లో విగ్రహాలు తప్ప మేము లేము' అంటూ పెద్ద పెద్ద కేకలు వేయడంతో ప్రజలంతా భయాందోళన కు గురయ్యారు.
ఈలోగా గ్రామానికి చెందిన మరో 20 మంది మహిళలు కూడా పూనకాలతో రామాలయానికి చేరుకొని ఆవేశంగా ఊగసాగారు. దీంతో వీరందరినీ దగ్గరలో వున్న దుర్గాలమ్మ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ అమ్మవార్లు ఆవరించినట్టు భావిస్తున్న మహిళలంతా గుడిముందు కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేశారు. గ్రామస్థులంతా జై దుర్గా జైజై దుర్గా అంటూ భక్తి, శ్రద్ధలతో వారికి పూజలు చేశారు. యారాడ గ్రామంలో ఇంకా మరికొందరు మహిళలకు ఈ విషయంలో పూనకాలు వస్తున్నట్తు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications