చెరుకు ధరపై దద్ధరిల్లిన పార్లమెంటు

సభ వాయిదా పడిన తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శరద్ పవార్, వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శరద్ పవార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చెరుకు రైతులకు ఎంత ధర చెల్లిస్తారనే విషయంపై వివాదం నెలకొంది. రైతులకు చెల్లించే చెరుకు ధరను పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చెరుకు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు జంతర్ మంతర్ లోని రామ్ లీలా మైదానంలో ప్రదర్శన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications