రోశయ్య పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

అనంతరం ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలు, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రదేశాలను ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. బీచ్‌రోడ్డు, తెన్నేటి పార్కు, కాపులుప్పాడ, గృహ సముదాయం, ఐటీపార్కులోని సింబోసియాస్ టెక్నాలజీస్, గిరిజన సదస్సు నిర్వహించే ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్, భద్రత, సదస్సుకు హాజరయ్యేవారికి కల్పించాల్సిన వసతి సౌకర్యాలు గురించి చర్చించారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ శ్యామలరావు, జాయింట్ కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, యూఎల్‌సీ ఎస్‌డీసీ ఎస్.సత్యనారాయణ, ఆర్‌డీఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications