వైయస్ జగన్ గ్రేటర్ ప్రచారం మొదలు

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే బంగారు మైసమ్మను దర్శించుకుని మహేశ్వరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించడానికి బయలుదేరారు. చెల్లెమ్మ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గం నుంచి ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి సంప్రదాయంగా చేసుకున్నారు. అలాగే జగన్ కూడా తన ప్రచారాన్ని సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గంలోని మహేశ్వరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన శుక్రవారం గ్రేటర్ హైదరాబాదులో సుడిగాలి పర్యటన చేస్తారు. ఆయన వెంట గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు నాయకుడు దానం నాగేందర్ తదితర నాయకులున్నారు.












Click it and Unblock the Notifications