వ్యతిరేకుల సీట్లపై వైయస్ జగన్ శీతకన్ను

తనను వ్యతిరేకిస్తున్న, తనవారు కాదనుకున్న కాంగ్రెసు శాసనసభ్యులున్న నియోజక వర్గాల్లో ఆయన ప్రచారం సాగించడం లేదు. జూబిలీహిల్స్, సనత్ నగర్, కంటోన్మెంట్, పటాన్ చెరు, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఆయన తిరగడం లేదు. జూబిలీహిల్స్ కు కాంగ్రెసు శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి జనార్దన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే వ్యవహరించారు. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి శంకర్ రావు, పటాన్ చెరు నుంచి నందీశ్వరగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా జగన్ కు సన్నిహితులు కారు. అలాగే అంబర్ పేటలో సీనియర్ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు తనవారికి టికెట్లు ఇప్పించుకున్నారు.












Click it and Unblock the Notifications