అసోం పేలుళ్లతో హైదరాబాదులో హై అలర్ట్

గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం సాయంత్రం నుంచి 24 ఉదయం ఆరుగంటల వరకు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఎలాంటి ర్యాలీలుగాని, సభలు గాని నిర్వహించరాదు. ఎన్నికల భద్రతక సంబంధించి 26 మంది పోలీసులను నియమించినట్లు గ్రేటర్ హైదరాబాదు పోలీసు కమిషనరు ప్రసాదరావు తెలిపారు. పోలీంగ్ కేంద్రాల పరిధిలో 200 మీటర్ల మేరకు 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు.
అసోంలోని నల్బరీ జిల్లా ఆదివారం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఉదయం 10 -10.15 గంటల ప్రాంతంలో మూడు వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
నల్బరీ పోలీస్ స్టేషన్ ఎదుట మొదట రెండు పేలుళ్లు సంభవించాయి. గోపాల్‌బజార్ ప్రాంతంలో మూడో బాంబు పేలుడు చోటుచేసుకుంది. సైకిళ్లకు బాంబులు అమర్చి దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్(ఉల్ఫా) తీవ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు












Click it and Unblock the Notifications