గ్రేటర్ విజయవాడకు సిఎం రోశయ్య ఓకె

గ్రేటర్ జాబితాలో ఉన్న 15 గ్రామాలు నగరంలో విలీనం అయితే మరో 10 లక్షల జనాభా అదనంగా పెరిగే అవకాశం ఉన్నందున విజయవాడ నగరాభివృద్ధికి జెఎన్‌ఎన్యూఆర్‌ఎం, ప్రపంచబ్యాంకు నిధులు కూడా మంజూరయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. గ్రేటర్‌హోదాను నిలబెట్టుకునేందుకు కార్పొరేషన్ నేతృత్వంలో తక్షణం 14 గ్రామపంచాయితీల (దోనె ఆత్కూరు గ్రామం నిడమానూరు పంచాయితీలో ఉంది) అనుమతిని తీసుకోవాల్సి ఉంది. సాధ్యమైనంత తొందరలో ఆయా గ్రామ పంచాయితీల అనుమతి తీసుకుంటే విజయవాడ రూరల్, పెనమలూరు మండలాలలోని గ్రామాలు విజయవాడలో అంతర్భాగం కానున్నాయి.
విజయవాడ రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, పి నైనవైరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి, రామవరప్పాడు, ప్రసాదం పాడు, ఎనికేపాడు, నిడమానూరు, దోనె ఆత్కూరు, పెనమలూరు మండలంలోని యనమల కుదురు, తాడిగడప, కానూరు, పోరంకి గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం అవుతాయి.












Click it and Unblock the Notifications