తిట్టుకుంటూ కూర్చోవడం కాదు: జెపి

Jayaprakash Narayan
హైదరాబాద్: రాజకీయ పార్టీలను తిట్టుకుంటూ కూర్చోవడం మంచిది కాదని, మన కోసం మనం ఓటేయాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. కొన ఊపిరితో ఉన్న ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు ఓటేయాలని ఆయన అన్నారు. ఆయన సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీలకు, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి అవసరాల కోసం ఓటేయాలని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోస ఓటేయడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఇవియంలు సరిగా పనిచేయకపోవడం వల్ల, చలి వల్ల ఉదయం పూట వోటింగ్ మందకొడిగా జరిగినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. యువత, మధ్యతరగతి చురుగ్గా ఓటేస్తున్నట్లు సమాచారం వస్తోందని ఆయన చెప్పారు. పార్లమెంటు ఎన్నికల కన్నా హైదరాబాద్ ఎన్నికలు ముఖ్యమైనవని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకోవడానికి ఇవి పనికి వస్తాయని ఆయన అన్నారు. ఇది పార్టీల పోరు కాదని, మన జీవితాలను మార్చుకోవడానికి జరుగుతున్న పోరు అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+