వాజ్పేయిని తప్పు పట్టిన లిబర్హాన్

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యవహరించిన తీరుపై కమిషన్ తీవ్ర విమర్శలు చేసింది. కూల్చివేత జరుగుతుంటే కళ్యాణ్ సింగ్ నియోగించిన అధికారులు, పోలీసు అధికారులు మౌనంగా ఉండిపోయారని దయ్యబట్టింది. కూల్చివేతకు ఉమా భారతి, గోవిందాచార్య, కల్యాణ్ సింగ్, శంకర్ సింఘ్ వాఘేలా బాధ్యులని కమిషన్ తేల్చింది. సీనియర్ బిజెపి నాయకులు వాజ్పేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూల్చివేతకు సైద్ధాంతికంగా, బౌద్ధికంగా బాధ్యులని విమర్శించింది. లిబర్హాన్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన వెంటనే బిజెపి సభ్యులు పార్లమెంటు ఉభయసభల్లో కూడా కార్యక్రమాలను స్తంభింపజేశారు.












Click it and Unblock the Notifications