చంద్రబాబు పెద్ద క్రిమినల్: పోసాని

చంద్రబాబును తాము నమ్మబోమని, ప్రజలు కూడా నమ్మడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులు డబ్బు ఖర్చు పెట్టకుండా, సారా తాగించకుండా గెలిచామని నిరూపించుకుంటే తాను చంద్రబాబు కాళ్లకు దండం పెట్టి ప్రశంసిస్తానని ఆయన అన్నారు. ఇనుప ఖనిజం తీసుకుపోతున్న గాలి జనార్దన్ రెడ్డి పెద్ద క్రిమినలా, రాజకీయాలను వ్యాపారంగా మార్చి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పెద్ద క్రిమినలా అని ఆయన అన్నారు.
తండ్రి పోయి ఆరు నెలలు కూడా కాక ఏడుస్తున్న జగన్ పై ప్రతిపక్షాలు విమర్సలు చేస్తున్నాయని ఆయన అన్నారు. జన్ తంతే చంద్రబాబు ప్రతిపక్షంలో పడ్డారని, అయినా చంద్రబాబు మారడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తన హయాంలోని అవినీతి ఆరోపణలపై సిబిఐకి అప్పగించారా అని ఆయన అడిగారు. సోమశేఖర కమిషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సిగ్గు లేకుండా చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications