న్యూఢిల్లీ: డాలర్ శేషాద్రికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటి (ఒఎస్డీ)గా శేషాద్రి పదవీ కాలాన్ని పొడగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. ఓఎస్డీగా డాలర్ శేషాద్రి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు.
తాను రేపటి నుంచి యధావిధిగా విధులకు హాజరవుతానని డాలర్ శేషాద్రి చెప్పారు. డాలర్ శేషాద్రిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కుంటున్న శేషాద్రిని ఒఎస్డీగా కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.