• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవి ' చెత్త ' ఆరోపణలే కావచ్చు: రోశయ్య

By Santaram
|

Rosaiah
విశాఖపట్నం: "అది నిజంగా వెయ్యి కోట్ల కుంభకోణమైతే ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చి ఉండేదే. కానీ అలా కన్పించడం లేదు. డిప్యూటీ మేయర్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుని ఉండవచ్చు" అని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం మధ్యాహ్నం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. చాలా మంది విలేకరులు "చెత్త" ఆరోపణలను ప్రస్తావించడంతో ఆయన తనకు భోజన విరామ సమయం అవుతోందని, ప్రశ్నలను త్వరగా ముగించాలని కోరారు.

విశాఖ కార్పొరేషన్ లోని ఆ ఆరోపణలపై కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఇప్పటికే రాజీ యత్నాలు చేశారు. జీవీఎంసీ 'చెత్త' పంచాయతీ మరోసారి కేంద్రమంత్రి, విశాఖ ఎంపీ పురందేశ్వరి ఎదుట జరగనుంది. ఈ వ్యవహారంపై ఆమె రెండు రోజుల క్రితం రాజధానిలో జిల్లా మంత్రి బాల రాజు, మేయర్‌, డెప్యూటీ మేయర్‌లతో భేటీ అయి రాజీ కుదిర్చారు. పార్టీనీ, జీవీఎంసీని కుదిపేస్తున్న చెత్త వివాదాన్ని తమ ప్రమేయం లేకుండా మేయర్‌, డెప్యూటీలతో ఎలా పరిష్కరిస్తారంటూ కొందరు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డెప్యూటీ మేయర్‌ దొరబాబు వర్గానికి చెందిన కార్పొరేటర్లు కంపా హనోకు, జి.వి.కృష్ణారావులు ఏకంగా జీవీఎంసీ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు.

రూ.వెయ్యి కోట్ల కుంభకోణంపై ప్రజలకు వివరణ ఇచ్చేదాకా మేయర్‌, డెప్యూటీలను జీవీఎంసీకి వెళ్లకుండా అడ్డుకుంటామని, తామూ వెళ్లబోమని ప్రకటించారు. సాక్షాత్తూ దొరబాబు వర్గీయులే ఇలా అడ్డం తిరగడంతో సర్వత్రా కలకలం రేగింది. మరోపక్క తమతో పనిలేకుండా పురందేశ్వరి ఇరువర్గాలకు రాజీ ఎలా కుదురుస్తారన్న అసంతృప్తి నగర ఎమ్మెల్యేల్లో కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లతో మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పురందేశ్వరి ఫోన్లో మాట్లాడారు. తాను బుధవారం సాయంత్రం విశాఖ వస్తున్నానని, అందరినీ కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరిస్తానని, అంతవరకూ ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని కోరారని హనోకు 'న్యూస్‌లైన్‌'కు తెలిపారు. చెత్త వివాదం ముఖ్యమంత్రి కె.రోశయ్య దృష్టిలోనూ ఉంది.

ఇప్పటికే మేయర్‌ పులుసు జనార్దనరావు సీఎంను కలిశారు. జీవీఎంసీలో రూ.వెయ్యి కోట్ల చెత్త కుంభకోణం జరిగిందంటూ కౌన్సిల్లో డెప్యూటీ మేయర్‌ దొరబాబు ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న పరిణామాలను ఆయనకు వివరించారు. సీఎం రెండు రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన రాకకు ముందే ఈ వివాదాన్ని చల్లబరచాలని పార్టీ నేతలు భావించారు. అనూహ్యంగా ఆ పంచాయతీ వారి మధ్య కాకుండా కేంద్రమంత్రి పురందేశ్వరి సమక్షంలో జరిగింది. బుధ, గురువారాల్లో ముఖ్యమంత్రి విశాఖలోనే ఉంటారు. మేయర్‌, డెప్యూటీల విభేదాలపై సీఎం జోక్యం చేసుకుంటారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఇంతలో పురందేశ్వరి బుధవారం కార్పొరేటర్లు, మేయర్‌, డెప్యూటీలతో సమావేశమవుతారన్న విషయం బయటికొచ్చింది. సీఎం నగరంలో బస చేస్తున్నందువల్ల బుధవారం రాత్రి వీరితో పంచాయతీ ఉంటుందా? గురువారానికి వాయిదా పడుతుందా? అన్న సందేహాలున్నాయి. చెత్త వివాదం వల్ల పార్టీ పరువు బజారున పడటంతో ఇప్పటికైనా దీనిని పరిష్కరించి, పార్టీకి మరింత నష్టం వాటిల్లకుండా చూడాలని సిసలైన కాంగ్రెస్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X