చిరంజీవికి 'గ్రేటర్' గుండు సున్నా

కాంగ్రెసు పార్టీతో పొత్తు ప్రయత్నాలు జరిగిన తీరు, అది బెడిసి కొట్టిన వైనం కూడా ప్రజారాజ్యం పార్టీ ఫలితాలపై ప్రభావం చూపినట్లు భావించవచ్చు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని, చిన్న పార్టీలకు ఓటేస్తే మురిగి పోతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన ప్రచారం ఫలించినట్లే కనిపిస్తోంది. కాంగ్రెసుకు చిరంజీవి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రత్యామ్నాయం కానేరదనేది స్పష్టమై పోయింది. అందువల్ల ఓటర్లు ప్రజారాజ్యం పార్టీ పట్ల విముఖత ప్రదర్శించినట్లు చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications