వైయస్ జగన్ ప్రచారం పని చేయలేదా?

గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు గెలుచుకున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి పాగా వేసింది. ఇప్పటి వరకు 138 డివిజన్ల ఫలితాలు తెలుస్తుండగా తెలుగుదేశం 42 స్థానాల్లో గెలిచింది. మరో స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతోంది. హైదరాబాదు శివారులోని 40 డివిజన్లలో దాదాపు 30 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇంకా కొన్ని ఫలితాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెసు ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న సంక్షోభంలో హైదరాబాదు శివారులోని కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపారు. వారి నియోజకవర్గాలన్నింటిలోని డివిజన్లలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. దీన్ని బట్టి వైయస్ జగన్ ప్రచారం పనిచేయలేదనే భావన నెలకొంది. జగన్ ప్రచారం వల్ల గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిందనే వాదన కాంగ్రెసులో బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications