హైదరాబాద్: తాను మామూలు రోశయ్యనే అని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. చిన జీయర్ స్వామికి చెందిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. తను సాధారణమైన వ్యక్తినే అని, తనకు పదవులపై ఆశ లేదని ఆయన అన్నారు. దైవం ఆదేశించిన పనులు చేయడమే తన బాధ్యత అని ఆయన చెప్పారు. ఉగ్రవాద దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మంచి మార్పు రావాలన్నదే తన అభిమతమని ఆయన చెప్పారు.
తన మట్టుకు తాను సాధారణమైన వ్యక్తినే అని, పదవి రావడం అదృష్టమని ఆయన చెప్పారు. దైవం తనపై మోపిన బాధ్యతను ప్రజలకు తృప్తి కలిగించేలా నెరవేర్చడమే తన పని అని ఆయన అన్నారు.