ప్రభుత్వాస్పత్రికి కెసిఆర్ తరలింపు

కాగా, కెసిఆర్ ను చూడడానికి సిద్ధిపేట నుంచి ఖమ్మం బయలుదేరిన తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రవీంద్రారెడ్డిలను పోలీసులు తిరుమలాయపాలెం వద్ద అడ్డుకున్నారు. కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు వరంగల్ సెంట్రల్ జైలు నుంచి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన తెలంగాణ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తనను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. జాతి పోరాటం చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. అనంతరం ఆయన తన తండ్రి కెసిఆర్ కు అండగా ఉండడానికి ఖమ్మం బయలుదేరారు.












Click it and Unblock the Notifications