రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం- జొన్నాడ సమీపంలో ఏపీ 35యు 3537 నెంబరు లారీ వంతెనపై నుంచి గోదావరిలో బోల్తాపడింది. ఈప్రమాదంలో ఒకరు మృతిచెందారు. లారీ పూర్తిగా ఇసుకలో కూరుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు.
రాష్ట్రంలో జనాభా రీత్యా అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ గణాంకాల ప్రకారం జంట నగరాల తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో నల్గొండ జిల్లా ఉంది.