హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ సైబర్ కేఫ్ లలో అసాంఘిక శక్తులు?

By Santaram
|
Google Oneindia TeluguNews

Cyber Cafes
హైదరాబాద్: నగరంలోని ఇంటర్నెట్‌ సెంటర్లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న 15 ఇంటర్నెట్‌ సెంటర్లను గుర్తించి అందరికీ సీఐ శ్రీనివాస్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారుతున్న ఇంటర్నెట్‌ సెంటర్లపై నిఘా తీవ్రం చేయాలని ఉన్నతాధికారుల నుంచి అదేశాలు అందడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా సెంటర్ల నిర్వాహకులకు నిబంధనలతో కూడిన నోటీసులను మంగళవారం జారీ చేశారు.

మొత్తం 15 ఇంటర్నెట్‌ సెంటర్లు ఉన్నప్పటికీ కేవలం 8 మాత్రమే అన్ని అనుమతులతో కొనసాగుతుండగా, 7సెంటర్ల నిర్వాహకులు అనుమతి పత్రాలను చూపెట్టలేదు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి అనుమతి ఉంటేనే నిర్వాహకులు ఇంట ర్నెట్‌ పాయింట్లను పెట్టుకోవాలని లేనిపక్షంలో వాటిని గుర్తించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇంటర్నెట్‌ నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు...
జారీ చేసిన లైసెన్స్‌ను ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి.
ఇంటర్నెట్‌ ముందుభాగం శుభ్రంగా ఉంచాలి, ఉమ్ము తొట్లను సమీపంలోనే ఏర్పాటు చేయాలి.
ఇంటర్నెట్‌ సెంటర్‌కు వచ్చే వ్యక్తి ఐడీ ప్రూఫ్‌తో పాటు నెట్‌లో ఎంత సేపు ఉన్నాడన్న విషయాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలి.
నమోదు చేసే సమయంలో ఒక ఫొటో, ఇంటి అడ్రస్‌ ఉండాలి.
వెబ్‌ కెమెరాను ఏర్పాటు చేసి ఇంటర్నెట్‌కు వచ్చే వ్యక్తుల ఫోటోలు తీసి ఆరు నెలల వరకు భద్రపరచాలి.
ఇంటర్నెట్‌కు వచ్చే వ్యక్తుల ఐపీ అడ్రస్‌ను, లాగ్‌ ఆన్‌, లాగ్‌ అవుట్‌ సమయాలను ఇంటెర్నెట్‌ నిర్వాహకులు తప్పనిసరిగా నమోదు చేయాలి.
ఇంటర్నెట్‌ సెంటర్లను రాత్రి 11 గంట లకు మూసివేయాలి.12 సంవత్సరాల లోపు పిల్లలను తప్పని సరిగా వారి తల్లిదండ్రులు ఉంటేనే అనుమతించాలి.
క్యాబిన్‌ లు 4 అడుగుల ఎత్తులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి, వాటికి డోర్లు ఏర్పాటు చేయొద్దు.
అశ్లీల సైట్లను అనుమతించరాదు. మూసివేసిన క్యాబిన్లకు వేరేవాటిని అటాచ్‌ చేయరాదు. ఈ నిబంధనలన్ని ఖచ్చితంగా పాటించాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X