కొబ్బరి తోటలో మహిళ సజీవ దహనం

Rajahmundry
రాజమండ్రి: అక్రమ సంబంధం ఆమె ప్రాణాలను బలిగొంది. రాజమండ్రిలోని మోరంపూడి శివారు ఐరన్‌ కంపెనీ సమీపంలోని కొబ్బరితోటలో ఓ మహిళ సజీవ దహనం అయిన సంఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు, స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం శాటిలైట్‌సిటీ డి-బ్లాకులో నివసిస్తున్న పసుపులేటి నాగమణి(30) రెండేళ్ల కిందట భర్త వదిలి వేయడంతో తన తల్లి భద్రం, ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత కొంత కాలంగా స్థానికంగా నివాసం ఉంటూ రాజమండ్రి ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకులో ప్యూన్‌గా పని చేస్తున్న యువకుడు కొల్లి సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

సత్యనారాయణ కుటుంబ సభ్యులు మోరంపూడి శివారులోని కొబ్బరితోటకు గత కొన్నాళ్లుగా సంరక్షకులుగా ఉంటున్నారు. ఆ తోటలో ఉన్న పాకలో పసుపులేటి నాగమణి, సత్యనారాయణలు తరుచూ కలుసుకుంటుండేవారు. సోమవారం సాయంత్రం 8 గంటల సమయంలో బ్యాంకు వద్దకు నాగమణి రావడంతో ఇద్దరూ కలిసి సైకిల్‌పై మోరంపూడి శివారులో ఉన్న కొబ్బరితోటకు వచ్చామని అక్కడ నాగమణిని దిగబెట్టి తాను సినిమాకు వెళ్లి అర్థరాత్రి ఒంటి గంట సమయంలో వచ్చి తోటలోని పాకలో ఉన్న నాగమణిని కలిసి అక్కడే పడుకున్ననని సత్యనారాయణ చెబుతున్నాడు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెళ్లి విషయంలో నాగమణికి తనకు గొడవ రావడంతో తాను కోపంగా బయటకు రాగా తర్వాత నాగమణి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు రేగి పాక మొత్తం అంటుకుందని చెబుతున్నాడు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ చేతులు కాలడంతో తాను బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల వారిని పిలిచేందుకు ప్రయత్నం చేసినట్టు సత్యనారాయణ చెబుతున్నాడు.

ఇల్లు మొత్తం కాలిపోయి నాగమణి మృతి చెందినట్టు చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న బొమ్మూరు ఎస్సై సుబ్రహ్మణ్యేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక వివరాలు సేకరించి విషయాన్ని డీఎస్పీకి తెలపడంతో డీఎస్పీ డి.జానకి, క్రైం సి.ఐ. సి.హెచ్‌.రామారావులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలు నాగమణితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న సత్యనారాయణను విచారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన నాగమణి ప్రియుడు చేతిలో హత్యకు గురైందా లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే విషయంలో పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోతున్నారు. సంఘటన జరిగిన తరువాత నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కొల్లి సత్యనారాయణ పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండి ఆత్మహత్య తన కళ్లముందే చేసుకుందని రక్షించే ప్రయత్నంలో చేతులు కాలాయని చెబుతున్నాడు.

కాలిన గాయాలతో ఉన్నవాళ్లు బాధతో బయటకు పరుగులు పెడతారు. కానీ నాగమణి మృతదేహం పాకలోపలే పడి ఉండడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలిపై సత్యనారాయణకు అనుమానం ఉండేదని దీంతో తరచూ వేధించేవాడని మృతురాలి తల్లి భద్రం చెబుతోంది. తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఇల్లు మొత్తంకాలి బూడిదయ్యే వరకు స్థానికులకు ఎవరికీ తెలియకపోవడం, ఇంట్లో కాలిపోతున్న నాగమణిని రక్షించేందుకు సత్యనారాయణ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+