హైదరాబాద్: హైదరాబాదులోని నిమ్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారంనాడు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి రావడంతో నిమ్స్ వద్ద కలకలం బయలుదేరింది. తెరాస కార్యకర్తలు చిరంజీవిని చుట్టుముట్టి జై తెలంగాణ నినాదం చేయాలని పట్టుబట్టారు. ఆయన కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని చిరంజీవిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
రెండు రోజులపాటు తిరుపతిలో పర్యటించి వచ్చిన చిరంజీవి హైదరాబాదు వచ్చిన తర్వాత శనివారం కెసిఆర్ ను పరామర్శించారు. అంతకు ముందు ఆయన కెసిఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులెవరూ పరామర్శకు రాకపోవడం గమనార్హం. శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి కూడా శనివారం ఉదయం కెసిఆర్ ను పరామర్శించారు.