ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి: జెఇసి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించినా తమకు అభ్యంతరం లేదని వారు చెప్పారు. కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని వారు శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ కు ఏమైనా జరిగితే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని వారు హెచ్చరించారు. కెసిఆర్ ను తాము కాపాడుకుంటామని వారు చెప్పారు. తెలంగాణపై తాము ఈ నెల 10వ తేదీన శాసనసభను ముట్టడిస్తామని వారు చెప్పారు. పదవ తేదీలోగా తెలంగాణ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు శనివారం కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.