వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'పులివెందులఎమ్మెల్యేగా విజయలక్ష్మి కొంతకాలమే'

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజా ప్రతినిధులు, ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంలో ఒక వ్యక్తికి ఓ పదవి కట్టబెట్టినంత మాత్రాన రాష్ట్రానికి మేలు చేసినట్లు కాదని, ప్రజలను మోసం చేసినట్లేనని పరోక్షంగా పార్టీ పెద్దలనుద్దేశించి రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనులను కొనసాగించే విషయంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని అన్నారు. అందుకు తెలంగాణలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమన్నారు. వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన విపక్షాలకు రవీంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.