అసెంబ్లీ వాయిదా: జై తెలంగాణ, జై ఆంధ్రా

సభ వాయిదా పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వారికి ప్రతిగా జై ఆంధ్రా అంటూ రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి నినాదాలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ కోత, రైతాంగ సమస్యలపై తెలుగుదేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణ కోరుతూ శాసనసభలో తీర్మానంపై తెరాస, బిజెపి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జీపై ప్రజారాజ్యం, తెలంగాణ ఉద్యమం - భయాందోళనలుపై సిపిఐ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి.












Click it and Unblock the Notifications