కాళ్లు మొక్కినా కెసిఆర్ వింటలేరు: హరీష్

తెలంగాణ ఏర్పాటుకు శాసనభలో తీర్మానం పెట్టే విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. తాము జై తెలంగాణ నినాదాలు చేస్తుంటే కాంగ్రెసులోని ఆంధ్రా శాసనసభ్యులు జై ఆంధ్ర నినాదాలు చేశారని, తెలంగాణ శాసనభ్యులు ఏమైనా అంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అంటారని ఆయన అన్నారు. ఆంధ్రా శాసనసభ్యులకు వర్తించని క్రమశిక్షణ తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులకే ఎందుకు వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రా కాంగ్రెసు శాసనసభ్యులు అహంకారంతో వ్యవహరిస్తుంటే తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు దాసోహం అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటికైనా పౌరుషం ప్రదర్శించాలని, తెలంగాణ కాంగ్రెసు నాయకులు తలుచుకుంటే ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications