చుక్కా రామయ్య బైఠాయింపు: ఒయులో ఉద్రిక్తత

బుధవారం ఉదయం నుంచే పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసే పనికి పూనుకున్నారు. హాస్టళ్లలోకి ప్రవేశించి లాఠీచార్జీ చేస్తూ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. రాత్రే హాస్టళ్లకు నీటిని, కరెంట్ ను కట్ చేశారు. అయినా విద్యార్థులు ఇంకా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. వారు దీక్షలు సాగిస్తూ ఉన్నారు. పోలీసులు టెంట్లను పీకేసి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులు ఆర్ట్ర్స్ కళాశాల వద్ద అన్నాలు వండుకుని తిన్నారు. పోలీసులు మీడియాపై కూడా దాడి చేశారు. దీనికి నిరసనగా మీడియా ప్రతినిధులు దర్నాకు దిగారు. దీంతో పోలీసాఫీసర్ ఇక్బాల్ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున పోలీసుల పని పోలీసులు చేస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications