ఆనందపు డోలికల్లో 'వరం ఘల్లు ఘల్లు'

ఒక్కసారిగా జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. జై తెలంగాణ అని నినాదాలు హోరెత్తించారు. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు చేసుకున్నారు. అభినందనల వెల్లువతో ఫోన్లన్నీ బిజీగా మారిపోయాయి. ఎస్‌ఎంఎస్‌లు పోటెత్తాయి. కేయూలో ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహపూరితంగా మారిపోయింది. విద్యార్థులు కేరింతలు కొడుతూ పోలీసులను హత్తుకున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణ ధిక్కార శక్తి మరోసారి ప్రపంచానికి చాటి నట్లయింది.
కేసీ ఆర్ ఆమరణ నిరాహారదీక్షకు ప్రజ లకు ఆందోళన దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి చిదం బరం- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని బుధవారం రాత్రి ఈ మేరకు ఒక ప్రకటన చేయడంతో జిల్లా యావత్ ఆనందడోలికల్లో ఊగిపోయింది. విద్యార్థులు ఆనందంతో నృత్యాలు చేశారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నుంచి పదకొండు రోజుల పాటు జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. వివిధ విద్యార్ధి సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం (జెఎసి) నాయకత్వంలో కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కేంద్రంగా ఆందోళనలు తీవ్ర స్ధాయిలో సాగాయి. ఆందోళనకు మద్దతుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు ఒక్కరేమిటి అన్ని వర్గాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు సైతం ఆందోళనలో పాలుపం చుకున్నారు. జిల్లా యావత్ ర్యాలీలతో దద్దరిల్లింది. రాస్తా రోకోలతో స్తంభించి పోయింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications