ఉద్వేగానికి లోనై రాజీనామాలు: రోశయ్య

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుందని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అన్నిపార్టీలతో మాట్లాడిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణమవుతుందని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవడం కూడా ప్రక్రియలో భాగమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితిని తమ పార్టీ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చకు సాయంత్రం ఆరు గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.అన్ని ప్రాంతాలవారితో చర్చించిన తర్వాత తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications