రాజీనామాలు: సంక్షోభంలో రోశయ్య ప్రభుత్వం

రోశయ్య ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో సాగుతోంది. పైగా, మెజారిటీ కాంగ్రెసు సభ్యులు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతూ రోశయ్యకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందనే ఊహాగానాలు ముందుకు వచ్చాయి. వైయస్ జగన్ ప్రాబల్యాన్ని దెబ్బ తీయడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ఇందుకు సిద్ధపడినట్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications