తెలంగాణ: టిడిపిలోనూ రాజీనామాల ప్రకంపనలు

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశంలోనూ రాజీనామాల పర్వం మొదలైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు రామకృష్ణ రాజీనామా చేశారు. తన శానససభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన గురువారం అందజేశారు. తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నాని కూడా తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం నాయకుడు కెఇ కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు ఆజ్యం పోశారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. తన నిర్ణయం ద్వారా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఇది దుర్దినమని తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+