తెలంగాణకు జై: కెసిఆర్ దీక్ష విరమణ

చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమించారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ చేతుల మీదుగా పండ్ల రసం సేవించి ఆయన తన దీక్షను విరమించారు. ఈ విజయం ప్రజలందరి విజయమని కెసిఆర్ దీక్ష విరమంచిన వెంటనే అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు, ప్రతిపక్ష నేత ఎల్ కె అద్వానీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 29వ తేదీ నుంచి విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తున్నట్లు కూడా చిదంబరం చెప్పారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకునే లోపలే కెసిఆర్ దీక్ష విరమించారు. దీంతో రోశయ్య తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications