హైదరాబాద్: కోస్తా, రాయలసీమ మంత్రుల సమావేశం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో ప్రారంభమైంది. మంత్రి బొత్స సత్యనారాయణ మినహా ఇరు ప్రాంతాలకు చెందిన అందరు మంత్రులు ఈ భేటీకి విచ్చేశారు. ఈ సమావేశాలకు శత్రుచర్ల, వట్టి వసంత కుమార్, కన్నా లకీనారాయణ, మోపిదేవి, గల్లా అరుణకుమారి, విశ్వరూప్, ఆనం, రఘువీరా, ధర్మాన, బాలరాజు, పితాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ విచ్చేశారు. కాగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రారంభమైన ఈ భేటీలో పాల్గొనేందుకు బొత్స విచ్చేసినప్పటికీ సమావేశంలో పాల్గొనకుండా వెనుదిరిగారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రుల సమావేశం కూడా కొంచెం ఆలస్యంగా మొదలైంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత తమ అడ్డాకు రావలసిందిగా తెలంగాణ మంత్రులను ఆంధ్ర మంత్రులు ఆహ్వానించారు. అందుకు తెలంగాణ మంత్రులు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రా మంత్రుల అడ్డాకు కాకుండా వేరే చోట ఏ స్టార్ హోటల్లోనైనా సమావేశం ఏర్పాటుచేస్తే వచ్చి ఆంధ్రా మంత్రులతో చర్చిస్తామని తెలంగాణ మంత్రులు చెప్పినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకుండా మధుయాష్కి ఢిల్లీ వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి