మరోసారి ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి, కీలక మలుపు...!!
వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న సాయిరెడ్డి.. మరో సారి ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికా రులు సోదాలు చేసారు. తన ఇంట్లో సోదాలు చేయటం పైన సాయిరెడ్డి ఆ తరువాత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక.. ఇప్పుడు విచారణలో ఆర్దిక లావాదేవీల పైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
వైసీపీ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కాం పైన ఈడీ అధికారులు ఫోకస్ చేసారు. మనీ లాండరింగ్ తో పాటుగా ఆర్దిక లావా దేవీల పైన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గతంలోనే సాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారణ చేసారు. కాగా.. సాయిరెడ్డి తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అధికారులు అడిగిన సమాచారం పైన తనకు తెలిసిన సమాచారం ఇచ్చానని.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సాయిరెడ్డి స్పష్టం చేసారు. కాగా.. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసారు. ఈడీ అధికారులు ప్రధానంగా మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి, వైల్డర్‌నెస్ రాంచ్ , ప్రైడ్ వంటి ప్రాజెక్టుల్లోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ అధికారులు ఈ కేసులో విచారణ చేస్తున్న వారి నుంచి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధం లేదని తేల్చి చెప్పిన విజయ సాయిరెడ్డి
కాగా.. సాయిరెడ్డి ఈ కేసులో అంతా రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డిలే చూసుకున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి రూ. 100 కోట్లు సర్దమంటేనే నేను కేవలం మధ్యవర్తిత్వం వహించాను అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లపై ఈడీ మరిన్ని స్పష్టతలు కోరింది. లీలా డిస్టిలరీస్, ఈశాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ వంటి సంస్థల ద్వారా జరిగిన నగదు బదిలీల వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై సాయిరెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. తన ఇంట్లో సోదాలు జరిగి నమయంలో సీఎం చంద్రబాబు పైన మండిపడ్డారు. తాను రాజకీయంగా తిరిగి రీ ఎంట్రీ ఇస్తానని ఆ సమయం లో ప్రకటించారు. త్వరలో మీడియా సంస్థను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పుడు తిరిగి ఈడీ అధికారుల విచారణకు సాయిరెడ్డి హాజరు కావటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.













Click it and Unblock the Notifications