పెరుగన్నంలో మామిడి పండు తింటున్నారా..అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

మామిడి-పెరుగు కాంబినేషన్ వేసవిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెండూ అమృతంలా అనిపి స్తాయి. చాలామంది మామిడి పండు ముక్కలను పెరుగులో కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ రుచిగా అనిపించినా.. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఈ కాంబినేషన్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వైద్య నిపుణులు ఈ విధంగా తీసుకోవటం పైన తమ అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నారు.

పెరుగు - మామిడి పండు కలిపి తినటం పైన నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అసలు ఈ రెండు ఇలా కలిపి అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. వాస్తవంగా పెరుగు వల్ల శరీరానికి చలవ చేస్తే.. మామిడి పండు శరీరంలో వేడిని కలిగిస్తుంది. విరుద్ధ గుణాలు కలిగిన రెండింటినీ కలిపి తింటే టాక్సిన్స్ (విష పదార్థాలు) ఏర్పడి.. ఆ తర్వాత అవి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అదే సమయంలో విరుద్ధ గుణాలు కలిగిన ఆహారాలను ఒకేసారి తిన్నప్పుడు మన శరీరంలోని జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక శరీరంలో 'ఆమ్లం' అంటే విషపూరిత వ్యర్థాలు లేదా టాక్సిన్స్ పేరుకుపోతాయి. కడుపులో కిణ్వ ప్రక్రియకు గురవుతాయి. దీనివల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ మరియు కడుపులో మంట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమందిలో వికారం, వాంతులు కూడా కావచ్చు.

 PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
mangoes-with-curd-during-summer-may-disturb-digestion-increase-mucus-formation-and-trigger-skin-rel

నిపుణుల సూచనలు

ఇక, మామిడి పండు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండు తినగానే వెంటనే నీళ్లు తాగవద్దంటున్నారు. అలా చేస్తే కడుపునొప్పి, ఎసిడిటీ (కడుపులో మంట) వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట ఆగి, ఆ తర్వాతే నీళ్లు తాగాలని చెబుతున్నారు. మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తింటే వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాక.. శ్వాస (ఊపిరి) తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్ తాగగానే మామిడి తిన్నా.. లేదంటే మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగినా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శరీరంలో ఒకేసారి చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మామిడి పండ్లలో చాలా వరకు రసాయనాలు వేసి మగ్గబెట్టినవే. మామిడి పండ్లను మగ్గబెట్టడానికి ఎక్కువగా కాల్షియం కార్బైడ్ వాడతారు. అయితే ఇది కేవలం పండు రంగును మాత్రమే మారుస్తుంది. దీంతో.. వేసవిలో మామిడి పండు తినే వారు కొంత అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+