రోశయ్యకు స్వల్ప గుండెపోటు, ఢిల్లీ పర్యటన డౌటు

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎంను ఒత్తిడికి గురికావద్దని వైద్యులు సలహా ఇచ్చారు. రెండు రోజులపాటు అధికారిక విధులకు దూరంగా ఉండి పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సీఎంకు వైద్యులు సూచించారు. ముఖ్యమంత్రి రోశయ్య రేపు ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీతో, ప్రధానితో చర్చలు జరపవలసి ఉంది. ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో ఢిల్లీ పర్యటన వాయిదాపడే అవకాశముంది.












Click it and Unblock the Notifications