దాడుల సమాచారంతో లగడపాటి ఆస్తులకు భారీ భద్రత

ఉస్మానియా విద్యార్ధులు ఉదయం పదిగంటల సమయంలో ల్యాంకో హిల్స్ వైపు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధినంలోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ ఎసిపి సర్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నలుగురు సిఐలు, పదిమంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్ళు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఖాజాగుడా-ల్యాంకోహిల్స్-మణికొండ మార్గాన్ని దిగ్బంధం చేశారు. ల్యాంకో హిల్స్ వద్ద ఆరు పికెట్లు ఏర్పాటు చేసినట్టు ఇన్ స్పెక్టర్ గంగారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications