విశాఖపట్నం: భారత్- శ్రీలంకల మధ్య ఈ నెల 18న జరిగే వన్డే మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సమైకాంధ్ర నినాదాలతో మార్మోగుతున్న విశాఖలో మ్యాచ్ జరపకూడదని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వాహక కమిటీ, ఏసీఏ, వీడీసీఏలు అత్యవసరంగా సమావేశమయ్యాయి.
రాత్రి ఏడు గంటల్లోగా మ్యాచ్ నిర్వహణపైనా, టికెట్ల విక్రయంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ నిర్వహణను ఎవరూ అడ్డుకోవద్దని దీని వల్ల విశాఖ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయని, ఇక మ్యాచ్‌లు జరిగే అవకాశాలు సన్నగిల్లుతాయని అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి