వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

16 నుంచి 26వతేదీ వరకు నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ రెండో సంవత్సరం పరీక్షలనూ రద్దు చేసినట్టు ఏయూ దూర విద్యా కేంద్రం సంచాలకులు హృషికేశవరావు తెలిపారు. 28వ తేదీ నుంచి జరిగే మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదని, అప్పటి పరిస్థితి బట్టి ఆలోచిస్తామని చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే ఎంబీఏ మొదటి సెమిస్టర్, ఎంకాం రెండో సెమిస్టర్, ఎల్‌ఎల్‌బీ అయిదో సెమిస్టర్ పరీక్షలనూ వాయిదా వేసినట్లు ఏయూ పరీక్షల నియంత్రణ అధికారి సామ్రాజ్యలక్ష్మి తెలిపారు.