వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజగోపాల్ అరెస్టుతో భగ్గుమన్న విజయవాడ

విజయవాడ నగరంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మూడువేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వీరికి అదనంగా రైల్వే పోలీసులు, సిఆర్ పి ఎఫ్ దళాలు శాంతభద్రతల విధులు నిర్వహిస్తున్నారు. లగడపాటి అనుచరులు హైదరాబాద్ కు తరలి రాకుండా విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను విజయవాడకు వెనక్కి పంపిస్తున్నారు.
సమైక్యాంధ్ర కోసం టిడిపి నాయకులు నగరంలో చేపట్టిన నిరాహారదీక్షలు సోమవారానికి రెండోరోజుకు చేరుకున్నాయి. నగరంలోని అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర సాధన ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు.