వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేం తెలంగాణ ఇస్తామనలేదు: గాదె

2004లో గానీ 2009లో గానీ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు భయపడి తెలంగాణ ఇస్తామని కేంద్రం ప్రకటించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. తెలంగాణపై కమిటీ వేస్తామని 2009 ఫిబ్రవరిలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాష్టాన్ని రెండుగా చీల్చడం దేవుడు కూడా క్షమించడని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై యుపిఎలో కూడా వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు రెండో ఎస్సార్సీయే పరిష్కారమని ఆయన చెప్పారు.