లగడపాటిని నిమ్స్ కు తరలించారా?

Lagadapati Rajagopal
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను రహస్యంగా హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తనను నిమ్స్ కు తరలించాలని లగడపాటి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లగడపాటిని నిమ్స్ కు తరలిస్తే హైదరాబాదులోని శాంతిభద్రతల సమస్య తలెత్త వచ్చునని అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. డిమాండును నెరవెర్చేందుకు ఎవరికీ తెలియకుండా ఆయనను నిమ్స్ కు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం ఖండించారు. లగడపాటిని రహస్యంగా నిమ్స్ కు తరలించాల్సిన అవసరం తమకు లేదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఎక్కడ ఉన్నా వెంటనే ఆస్పత్రిలో చేరాలని ఆమె రాజగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు సంయమనం పాటించడం అవసరమని ఆమె అన్నారు. లగడపాటి మాయమైన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశమై పరిస్థితిని వివరించారు. సంఘటనపై ఆమె విచారణకు ఆదేశించారు. లగడపాటి రాజగోపాల్ అదృశ్యంపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లగడపాటి ఈ విధంగా చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. మీడియాతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని చెప్పి రాజగోపాల్ పారిపోయారని ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ భార్య పద్మజ, ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి పార్థసారథి సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+