తెలంగాణపై తల పట్టుకున్న హై కమాండ్

కాగా, తెలంగాణ అంశంపై మంగళవారం సాయంత్రం అధిష్టానం నుంచి ఒక ప్రకటన రాగలదని భావిస్తున్నారు. రాజ్యసభ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళవారం తెలంగాణపై ఒక ప్రకటన చేయవచ్చుననే వార్తలు వచ్చాయి. కాగా, సోమవారం కోర్ కమిటీ సమావేశం తర్వాత మళ్లీ కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరు కలిసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. రోజులు గడుస్తున్న కొద్దీ సీమాంధ్ర ఎంపీల్లో అసహనం పెరుగుతోంది. అధిష్టానం నుంచి తమకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే రాజీనామాలు చేయడం తప్ప మరో మార్గం లేదనేంతగా వారు అసహనానికి గురవుతున్నారు.












Click it and Unblock the Notifications