సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు దీక్ష: ఉమ

Devineni Umamaheswara Rao
గుంటూరు: సమైక్యాంధ్రపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వెలువరించే వరకు తాను దీక్ష సాగిస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆమరణ నిరాహార దీక్ష గుంటూరులో రెండో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్ర నినాదంతో ఆమె సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆమెను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+