సమైక్యాంధ్ర కోరుతూ విశాఖలో భారీ ర్యాలీ

సమైక్యాంధ్రపై మంగళవారం కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రాజారావు తెలిపారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న కుమార్‌తో దీక్ష విరమించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఒక దశలో హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ నాయకత్వంతో ఫోన్‌లో మాట్లాడించినా ఫలించలేదు. పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లు విద్యార్థులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. దీక్ష చేస్తున్న గదికి ఎవరినీ అనుమతించడంలేదు. సెలైన్లు తప్ప ఎలాంటివి లోపలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వీరి సెల్‌ఫోన్లను కూడా అనుమతించలేదని తెలిసింది. పత్రికా విలేకరులప్రవేశంపైనా ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications