కెసిఆర్ దొంగ దీక్షను బయట పెట్టడానికే: లడగపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దొంగ దీక్షను బయటపెట్టడానికి ఈ నెల 19వ తేదీ తర్వా తాను దీక్షను కొనసాగించానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. నిమ్స్ నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిజానికి తన దీక్ష ఈ నెల 19వ తేదీననే ముగిసిందని, వైద్యులు సెలైన్ ఎక్కించడంతో తన దీక్ష ముగిసిందని, అయితే దొంగ దీక్షల గురించి ప్రజలకు తెలియజెప్పడానికే తాను ఆ తర్వాత ఆధునిక దీక్ష చేశానని ఆయన అన్నారు. వేర్పాటువాదులు దొంగ దీక్షలు చేసి ప్రజలను మోసం చేశారని, ప్రజల ప్రాణాలను బలిపెట్టారని ఆయన అన్నారు. గాంధీ మహాత్ముడు చేసిన దీక్షకు విలువ ఇవ్వాలి గానీ సెలైన్ ఎక్కించకుంటూ దీక్షలు చేసేవారికి విలువ ఇవ్వకూడదని ఆయన అన్నారు. టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ తీసుకుంటే ఎన్ని రోజులైనా దీక్ష చేయవచ్చునని ఆయన చెప్పారు. అందువల్ల అటువంటి దీక్షలకు భయపడి ప్రభుత్వాలు లొంగిపోవడం సరి కాదని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్రలోని నాయకులు దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కార మార్గం తన దీక్ష వల్లనో, మరొకరి దీక్షవల్లనో కాదని ఆయన అన్నారు. తాను పోలీసుల కస్టడీలో లేనని, అందువల్ల తాను విజయవాడ నుంచి హైదరాబాదుకు వచ్చినందుకు పోలీసులను సస్పెండ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం పునరాలోచనలో పడిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి తమకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ మెడికల్ రిపోర్టు ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.నేడో రేపో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+