దీక్ష విరమణకు లగడపాటి నిర్ణయం

లగడపాటి రాజగోపాల్ నిమ్స్ చేరినప్పటి నుంచి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు. లగడపాటితో దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీక్ష వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుత స్థితిని తెలుగుదేశం పార్టీ అవకాశంగా తీసుకునేందుకు కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర ఆందోళన ఉపయోగపడుతుందనే భావన ఉంది. దీంతో లగడపాటి దీక్ష విరమించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కడప జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డిని లగడపాటి ఫోన్ లో పరామర్శించారు. నిమ్స్ లో తన వల్ల రోగులకు కలుగుతున్న ఇబ్బందులతో లగడపాటి చలించిపోయినట్లు జయప్రకాష్ చెప్పారు.












Click it and Unblock the Notifications