కెసిఅర్ కు మోహన్ బాబు ఓపెన్ చాలెంజ్

Mohan Babu
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తాను ఓపెన్ చాలెంజ్ చేస్తున్నట్లు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. కెసిఆర్ కన్నా పదింతల బలం తనకు ఉందని, కావాలంటే చూసుకుందామని ఆయన అన్నారు. పేట్ బషీర్ పేటలో జరిగిన షూటింగ్ ను భగ్నం చేయడంపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కెసిఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాయలసీమ గొడ్డు కారం తిన్నానని, కెసిఆర్ కు ఎంత బలం ఉందో అంతకు పదింతల బలం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తని, చెప్పాలంటే ముస్లింల సొత్తని, వారికిచ్చి వెళ్లపోదామని ఆయన అన్నారు. తెలుగు ప్రాంతాన్ని విడదీయకూడదని, కలిసి మెలసి ఉందామని చెబుతున్నామని ఆయన అన్నారు. రెచ్చిపోయి రక్తపాతాలు చేయవద్దని ఆయన అన్నారు. కెసిఆర్ విధానం మారాలని, ఆరాచకం వద్దని ఆయన అన్నారు.

యుద్ధ వాతావరణం నెలకొల్పవద్దని ఆయన సూచించారు. కెసిఆర్ రౌడీయిజం చేయదలుచుకున్నారని ఆయన అన్నారు. తమ మీదికి రౌడీలను పంపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కావాలని కోరుకునే హక్కు మీకెంత ఉందో సమైక్యంగా ఉండాలని తాము చెప్పడానికి కూడా అంతే హక్కు ఉందని ఆయన అన్నారు. తాను పిరికిపందను కానని ఆయన అన్నారు. ఈ హైదరాబాద్ అందరి సొత్తు అని ఆయన అన్నారు. పోలీసుల్లోనూ తెలంగాణ గురించి గిల్లేవారున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ రమ్మంటే వచ్చామా, చెన్నారెడ్డి రమ్మంటే వచ్చామని ఆయన అన్నారు. చెప్పడానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎవడని ఆయన అన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. తెలుగు సినిమాలు ఎంత కాలం ఆపుతారని ఆయన అడిగారు. హిందీ సినిమాలు చూస్తారా అని అడిగారు. చేయకూడని చేయనప్పుడు అందరికీ ఏ పనులైనా చేయవచ్చునని ఆయన అన్నారు. తల్లిబిడ్డలం కలిసి ఉందామని అంటున్నామని ఆయన అన్నారు. వాళ్లు నిజమైన విద్యార్థులు కారని ఆయన అన్నారు. తెలుగువాడు తెలుగువాడిపై దాడి చేయడమేమిటని ఆయన అడిగారు. తాను ఒక ప్రాంతాన్ని బలపరలేదని ఆయన అన్నారు.

రాయలసీమలో తినడానికి తిండి, కట్టడానికి బట్ట, తాగడానికి నీరు లేదని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్నది రాయలసీమ అని, తెలంగాణ కన్నా రాయలసీమ ఎక్కువ వెనకబడిపోయిందని ఆయన అన్నారు. గుంటూరులోని హైకోర్టును ఇక్కడెందుకు పెట్టారని ఆయన అడిగారు. ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాదును అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. చెన్నైలో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు ఏమీ అనలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లోనే కెసిఆర్ సత్తా ఏమిటో తెలిసిపోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+